తెలంగాణ లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..!!!

*తెలంగాణ లో భారీ వర్ష సూచన*

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ రోజు వేకువ జామున తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన విషయం తెలిసిందే.

అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది, మామిడికాపు నేలరాలి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాగా, (మంగళ వారం) ఈరోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.