రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు..

రెండు తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందికర వార్త… తెలుగు రాష్ట్రాల సన్నద్ధమవుతున్న రైతులకి రాగల మూడు రోజుల్లో వర్ష సూచన తెలియడంతో ఆందోళనకు గురవుతున్నారు…

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశం… వాతావరణ విశ్లేషణ, హెచ్చరికలను హైదరాబాద్
వాతావరణ కేంద్రం సోమవారం (ఏప్రిల్ 4) ఉదయం జారీ చేసింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని మరట్వాడ నుంచి ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు కొనసాగింది. సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దాంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి…

ఎండ తీవ్రత తగ్గే అవకాశాలు..

ఎండలు గత సంవత్సరం కంటే తొందరగా మొదలయ్యాయి. మార్చి మధ్య నుంచే తెలంగాణాలో రోజురోజుకీ భానుడు భగభగమన్నాడు. ఎండ తీవ్రతకు రోడ్ల మీద జనాలు కనిపించడం తగ్గిపోయింది. అయితే గత వారం రోజులుగా తన ప్రతాపాన్ని చూపిన బాణుడు.. నిన్న మాత్రం కాస్త కనికరించాడు. ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో భానుడి ప్రతాపం తగ్గే అవకాశాలు ఉన్నాయి.