రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.జూన్‌ 26 రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ..

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వానకాలం రైతుబంధు నిధుల విడుదల తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. జూన్‌ 26 నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.ఈ నెల 24 నుండి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సర్కార్ డెసిషన్ తీసుకుంది. పట్టాల పంపిణీ తర్వాత పోడు రైతులకూ రైతుబంధు సాయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుల పెట్టుబడికి ఇబ్బంది లేకుండా వారికి సాయం అందించే విధంగా రైతుబంధు తీసుకొచ్చారు కేసీఆర్..