340 అద్దె బస్సులకు టెండర్లు.. 28న ప్రీ బిడ్‌ సమావేశం..

*🔹340 అద్దె బస్సులకు టెండర్లు.. 28న ప్రీ బిడ్‌ సమావేశం..*

హైదరాబాద్ గ్రేటర్‌ జోన్‌లో 340 అద్దె బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానిస్తోంది.

అద్దె ప్రాతిపదికన హైదరాబాద్‌ రీజియన్‌ లో 162, సికింద్రాబాద్‌ రీజియన్‌ లో 178 బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు ఔత్సహికులైన పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

టెండర్ల దాఖలు, నియమ నిబంధనలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత అధికారులతో సికింద్రాబాద్ లోని జూబ్లీబస్ స్టేషన్‌ రెండో అంతస్తులో ఉదయం 11 గంటలకు ఈ నెల 28న ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పూర్తి వివరాలకు www.tsrtc.telangana.gov.in వెబ్‌ సైట్‌ లో పొందుపర్చినట్లు తెలిపారు.