విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించే వారికి గుర్తింపు.ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌…

R9TELUGUNEWS.COM.‘విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించే వారికి గుర్తింపు ఉంటుంది. విధి నిర్వహణను భారంగా భావించవద్దు. అంకితభావంతో పని చేయాలి. బాధ్యతలు నిర్వహించే సమయంలో ఒత్తిడిని అధిగమించాలి. సవాళ్లను ఎదుర్కోవాలి’’ అని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన జూమ్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘సీసీఎస్‌తోపాటు ఇతర బకాయిలను త్వరలో చెల్లిస్తాం. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌ బకాయిలూ త్వరలో చెల్లిస్తాం’’ అని సజ్జనార్‌ తెలిపారు.