సెలవు కావాలంటే డెబ్‌బాడీతో సెల్ఫీ దిగి పంపించు…. ఒక ఉద్యోగికి… అతని పై ఉద్యోగి సలహా….

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన డ్రైవర్‌ ఒకరు తమ సమీప బంధువు మరణించాడని, అంత్యక్రియలకు వెళ్ళాలంటూ సెలవు కావాలని పై అధికారులను కోరాడు. ఈ విషయాన్ని మానవత్వంతో చూడాల్సిన సదరు అధికారి సెలవు కావాలంటే డెబ్‌బాడీతో సెల్ఫీ దిగి పంపించమని చెప్పాడు….ప్రస్తుతం ఈ అంశంపై ఆర్టీసీ కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే కాదు ఇలాంటి సంఘటనలు రోజుకో డిపోలో జరుగుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. సంస్థను గట్టెక్కించాలన్న తమన అధికారుల కంటే తమలోనే అధికంగా ఉందని, నిర్ణీత పని గంటల కంటే ఎక్కువ సమయం విధులను నిర్వహిస్తున్నామని, అయినా అధికారులు తమను ఎఫిషియన్సీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే డిపోకు చెందిన డ్రైవర్‌ ఒకరు తమ పట్ల అధికారులు అనుసరిస్తున్న తీరును వివరిస్తూ ఫెస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు సదరు డ్రైవర్‌ను ఏకంగా ఉద్యోగంలో నుంచి తొలగించారు…