ఆర్టీసీ బస్సులకు లోగో ఏమి మార్చలేదు..!సంస్థ ఎండీ సజ్జనార్.

తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పుపై చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై….సంస్థ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు..TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని చెప్పారు.

టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోందని కొట్టిపారేశారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని…. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని తెలిపారు.