తెలంగాణలో నేటి నుంచే విద్యా సంస్థలు..

*తెలంగాణలో మోగిన బడి గంట..

R9TELUGUNEWS.COM..తెలంగాణలో నేటి నుంచే విద్యా సంస్థలు తెరచుకున్నాయి. 24 రోజుల సెలవుల అనంతరం పాఠశాలలను పునఃప్రారంభించారు. కోవిడ్ నిబంధనలను కఠినంగా అధికారులు అమలు చేస్తున్నారు. విద్యాసంస్థల్లో శానిటైజర్లు, మాస్క్‌లతో పాటు అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా వ్యాప్తితో జనవరి 8 నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. తర్వాత జనవరి 30వ తేదీ వరకు, ఆపై మరో రోజు పొడిగించారు. అయితే, వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గిన నేపథ్యంలో ఈ నెల 1 నుంచి విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వంటి అన్ని విద్యా సంస్థలు మంగళవారం మొదలయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సుమారు 26 వేల పాఠశాలలు ఉండగా, వాటిలో 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.