తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అందరికీ 8 మార్కులు…!!!

-మొత్తం 8 ప్రశ్నలు తోలగింపు*

తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు శుభవార్త. ఈ పరీక్షకు సంబంధించిన కీని అధికారులు విడుదల చేశారు. అయితే మొత్తం 8 ప్రశ్నలను డిలీట్ చేసినట్లు కీలో పేర్కొన్నారు అధికారులు. మరో 6 ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా వెల్లడించారు. ఇందులో ఒక ప్రశ్నకు 3 ఆప్షన్లను సరైనవిగా తెలిపారు.

మరో 5 ప్రశ్నలకు రెండు ఆప్షన్లు కూడా సరైనవిగా పేర్కొన్నారు. డిలీట్ చేసిన ప్రతీ ప్రశ్నకు అభ్యర్థులందరికీ మార్కులు ఇస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ప్రతీ అభ్యర్థికి అదనంగా 8 మార్కులు కలవనున్నాయి. 

*ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహించగా.. 60 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించారు. 8 మార్కులు కలుస్తుండడంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది.* ఇంకా అభ్యర్థులు ప్రాథ‌మిక కీపై ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే ఆగ‌స్టు 15న సాయంత్రం 5 గంట‌ల‌ వరకు తెలియజేయాలని వ‌ర‌కు బోర్డుకు తెలియ‌జేయాల‌ని అధికారులు సూచించారు.