తెలంగాణ వీరత్వానికి ప్రతీక సార్వాయి పాపన్న గౌడ్..మంత్రి జగదీష్ రెడ్డి

సర్దార్‌ పాపన్న సేవలు చిరస్మరణీయం

బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహానీయుడు

తెలంగాణ వీరత్వానికి ప్రతీక సార్వాయి పాపన్న గౌడ్

వెనుకబడిన వర్గాలకు సముచిత గౌరవం కల్పిస్తున్న అభినవ సర్దార్ పాపన్న కేసీఆర్

*సూర్యాపేట*
బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహానీయుడు సర్వాయి పాపన్న అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.శుక్రవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం లో సర్వాయి పాపన్న గౌడ్‌ మహారాజ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డ్డి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బహుజన బాందవుడు సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న యావత్‌ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని అన్నారు.
సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు, బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని మంత్రి అన్నారు.అన్ని వర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పాపన్న పోరాడారని మంత్రి అన్నారు. పాపన్న జీవితం స్ఫూర్తిదాయకమని, తెలంగాణ ప్రభుత్వం పాపన్న జయంతి నిర్వహించడం , వెనుకబడిన వర్గాలను ఆర్దికంగా అందుకుంటూ సిఎం కేసీఆర్ సముచిత గౌరవం కల్పిస్తున్నారని తెలిపారు.ఆత్మగౌరవం కోసం వివక్ష, దురభిమానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సర్వాయి పాపన్న స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన బాటలో బహుజనులు, గౌడ సోదరులు నడువాలని పిలుపునిచ్చారు.
బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహానీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు,జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,
మున్సిపల్ చైర్మన్ పెనుమాల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి,వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, పోలీస్ అధికారుల సంఘం నేత రామచంద్ర గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, అనంత యాదగిరి గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, బైరు వెంకన్న గౌడ్, ఇతర కౌన్సిలర్లు, బీసీ నేతలు హాజరయ్యారు.