తెలంగాణ టీడీపీ పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ..!

తెలంగాణ టీడీపీ పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా

అంతా సిద్దం చేసుకున్నా కూడా తెలంగాణలో పోటీ చేయొద్దని చంద్రబాబు చెప్పారు. లోకేష్‌కు 20 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. కార్యకర్తలకు సమాధానం చెప్పలేక రాజీనామా చేశాను – కాసాని జ్ఞానేశ్వర్..

తెలంగాణలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి ఆయన రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి పంపించారు…తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పోటీ చేద్దామని చెప్పినా చంద్రబాబు వద్దన్నారు. దీంతో కాసాని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలో టీడీపీకి రాజీనామా చేసేశారు కాసాని. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు చెప్పారు. కార్యకర్తలకు సమాధానం చెప్పలేకనే రాజీనామా చేస్తున్నా.
20 నుంచి 25 సీట్లు గెలిచేది. చంద్రబాబు జైలుకి వెళ్లాక ఏ విధంగా ఉప్పెనలా కార్యక్రమాలు జరిగాయో అంతా చూశారు. ఈసారి ఎక్కువ గ్రోత్ ఉండే. చంద్రబాబుకి ఏం బాధ ఉందో తెలియదు కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు” అని కాసాని అన్నారు.

”ఇవాళ సాయంత్రం వరకు టీడీపీ ఆఫీసులోనే ఉన్నా. చంద్రబాబు నుంచి ఏదైనా సందేశం వస్తుందేమోనని ఎదురు చూశా. కానీ ఏమీ రాలేదు. ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు అని కార్యకర్తలు అడిగితే నేను సమాధానం చెప్పుకోవాలి కదా. కేడర్ కు నేను ఏమని చెప్పాలి? పోటీ చేయకపోవడం కరెక్ట్ కాదు. చంద్రబాబు వైఖరి తప్పు. కేడర్ ను నట్టేట ముంచడం సరికాదు. ఇన్నాళ్లు వాళ్లు కష్టపడ్డారు” అని కాసాని అన్నారు.