తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదల…!

*Big Breaking*
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) నోటిఫికేషన్ ను ఈరోజు SCERT విడుదల చేసింది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడువు ఆగస్టు – 2 నుండి 16 వరకు కలదు. దరఖాస్తు ఫీజు 400/-
రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది . రేపటి నుంచి ఆగస్టు 16 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తామని తెలిపింది . సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించి 27న ఫలితాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు..టెట్-2023కు సంబంధించి పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అర్హత ఉన్నవారు రాయడానికి అర్హులు. అదేవిధంగా బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివుతున్నవారు కూడా టెట్ రాయడానికి అర్హులే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు జరుగనున్నాయి. సెప్టెంబరు 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.