తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గం..వైఎస్‌ షర్మిల.

R9TELUGUNEWS.COM: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు ఆమె ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1.9లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. షర్మిల బైఠాయించడంతో ఆ ప్రాంతంలో సుమారు గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు వైతెపా కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. అంతకుముందు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డికి షర్మిల వినతిపత్రం అందజేశారు.