అరుదైన మొక్కలు పెంపకం ద్వారా విశేష గుర్తింపు పొందిన మహిళా నర్సరీ రైతు సత్యను అభినందించిన, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత..

మహిళా నర్సరీ రైతు సత్యను అభినందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి,,ఎమ్మెల్సీ కవిత..

అరుదైన మొక్కలు పెంపకం ద్వారా విశేష గుర్తింపు పొందిన మహిళా నర్సరీ రైతు మార్గాని సత్యను తెలంగాణా జాగృతి వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు అభినందించారు…
కడియం మండలం కడియపులంక గౌతమీ నర్సరీ రైతు మార్గాని వీరబాబు సతీమణి సత్య నర్సరీ మొక్కల పెంపకంలో ప్రత్యేకతలు చాటుకున్నారు. నర్సరీ రంగంలో మహిళలు అరుదుగా ఉంటారు. సత్య మాత్రం మొక్కల పెంపకంపై ఉన్న ఆసక్తితో ఈ రంగంలో రాణిస్తూ వార్తలకెక్కుతున్నారు.అయితే యాదాద్రి ఉత్సవాలు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజర్,రాజ్యసభ సభ్యులు సంతోష్ కవత,ఇంద్రారెడ్డి లకు సత్యను పరిచేసి తెలంగాణా హరిత హరం ద్వారా మొక్కల పెంపకంలో ఈమె నర్సరీ ప్రత్యేకతలను వివరించారు.దీంతో ఆ మహిళా నేతలు ఇరువురు సత్యను ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు అన్నిరంగాలలో రాణించాలన్నారు.ఈ సందర్భంగా కడియం నర్సరీలను తిలకించడానికి రావాలని కవిత,ఇంద్రారెడ్డిలను ఆహ్వానించామని వీలుకుదిరినప్పడు తప్పకుండా వస్తామని వారు హామీ ఇచ్చారని సత్య తెలిపారు.