టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌..

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్‌ తమిళి సై బుధవారం ఆమోదించారు.

గత సంవత్సరం డిసెం బర్‌లో టీఎస్‌పీఎస్‌ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. కాగా, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామా లను వెంటనే ఆమోదించా లని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.

ఆ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన లేఖ రాశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామా లు చేసి నెల రోజులు గడు స్తున్నా.. గవర్నర్ వాటిని ఇంత వరకు ఆమోదించడం లేదని అన్నారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ లేక పోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసు కోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ బుధవారం టీఎస్‌ పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపింది.