గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించవలసిందే: ధర్మాసనం..

*గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించవలసిందే: ధర్మాసనం*..

తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో షాక్ తగిలింది.
టిఎస్ పిఎస్సి అప్పీల్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

బయోమెట్రిక్ అమలు చేయకుండా టిఎస్ పిఎస్సి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్పీ డివిజన్ బెంచ్ అప్పీల్ కు వెళ్లింది.

ఈ నేపథ్యంలో బుధవారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు నిర్ణయం సరైనదేనని, ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది . పరీక్షలో అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది..