టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్…14 లక్షలకు అమ్మేందుకు బేరం.. అమ్మాయి కోసమే పేపర్ లీక్..!!.

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కొత్త కోణం బయటపడింది. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు దర్యాఫ్తులో వెల్లడైంది.
టీఎస్ పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ కోసం తరుచుగా ఓ యువతి వచ్చేదని, ఆమె కోసమే పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్ ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు(police) విచారణలో కీలక విషయాలు తెలిసినట్లు పేర్కొన్నాయి. TSPSC కమిషన్ ఆఫీసులో అత్యంత భద్రంగా ఉండే సిస్టమ్ నుంచి సమాచారం చోరీ చేసింది సిబ్బంది మాత్రమేనని తేలింది. అయితే ఆ క్వశ్చన్ పేపర్ ను రూ.14 లక్షలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీనిలో ఇద్దరికి వాటా ఉందని.. ఆ నగదును పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే రూ.10 లక్షలు ఇచ్చారని..ప్రశ్న పత్రాలను బహిరంగంగానే అమ్ముతున్నారని తెలిసింది..ప్రశ్న పత్రాలను ఎలా బయటకు తీశారు అనే అంశంపై పోలీసులు(police) మరింత వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ప్రస్తుతం 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్, మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష కూడా..ఈ లీక్ వ్యవహారం నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు..

రేణుక నుంచి క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేసిన సర్పంచ్ కుమారుడు మరికొంత మందికి అమ్మి డబ్బులు దండుకోవాలని ప్లాన్ వేశాడు. ఆ క్రమంలో లక్ష రూపాయలు ఇస్తే ఆ ఎగ్జామ్ పేపర్ జిరాక్స్ కాపీ ఇస్తానని పలువురికి సమాచారం ఇచ్చాడు. దీంతో అలా కొంతమంది ఆశ పడగా..మరికొంత మంది పోలీసులకు తెలిపారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.