టీఎస్పీఎస్సీ కేసు.. భార్యాభర్తలపై వేటు…

*

*వనపర్తి*:టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో నిందితులుగా ఉన్న రేణుకతోపాటు ఆమె భర్త డాక్యానాయక్ పై వేటు పడింది. రేణుక వనపర్తి జిల్లా బుద్దారం గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త డాక్యానాయక్ వికారాబాద్ జిల్లాలో జాతీయ ఉపాధిహామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో భార్యాభర్తలు నిందితులుగా.. రిమాండ్‌కు తరలించడంతో మంగళవారం అధికారులు కుటుంబసభ్యులకు తొలగింపు నోటీసులు అందించారు