TSRTC సరికొత్త ఆలోచన.. ఇకపై ఆర్టీసీ బ్రాండ్ వాటర్ బాటిల్ సేల్స్!…

టీఎస్‌ఆర్టీసీ సరికొత్త ఆలోచనలతో ఎప్పుడూ ముందుకు వస్తోంది. కేవలం ప్రయాణికుల సేవలే కాకుండా కార్గో సర్వీసులతో ఆదాయాన్ని పెంచుకుంటున్న ఆర్టీసీ.. ఇప్పుడు వాటర్ బాటిల్స్ విక్రయాలతో ముందుకు రానుంది. ఏసీ బస్సుల్లో ఉచితంగా అందించే వాటర్ బాటిల్స్ స్థానంలో తాము తయారు చేసే వాటిని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయనుంది. ఈ మేరకు ఆమోదముద్ర కూడా పడింది. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ ఆదాయ మార్గాన్ని పెంచుకుంటుండగా.. ఇప్పుడు వాటర్ బాటిల్స్ సేల్స్‌తో మరింత ఆర్థిక బలాన్ని పుంజుకోవాలని చూస్తోంది. టీఎస్‌ఆర్టీసీ సొంత బ్రాండ్ పేరుతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఈ మేరకు గత వారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ప్రముఖ కంపెనీల నుంచి వాటర్ బాటిల్స్ తయారు చేయించాలని నిర్ణయించింది.