తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా డా’ నరసింహరెడ్డి దొంతిరెడ్డి…

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా డా’ నరసింహరెడ్డి దొంతిరెడ్డి.. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) 2023-2024 సంవత్సరాలకి గాను తమ కార్యవర్గాన్ని ఎన్నుకుంది. 2015 లో తెలంగాణ వచ్చిన తరువాత ఏర్పడిన ఈ సంస్థ అనతికాలంలోనే అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో షుమారు పన్నెండు వేల కుటుంబాలతో అతి పెద్ద సంస్థగా విస్తరించి పలు సేవ కార్యక్రమాలు భారత్ మరియు అమెరికాలో సేవలందిస్తుంది. అయితే 2023-2024 కు 39 మంది బోర్డు సభ్యులతో అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో కార్యవర్గాన్ని ఎన్నుకుంది. జరిగిన ఈ ఎన్నికలలో మట్టంపల్లి కి చెందిన ఎన్నారై డా. నరసింహ రెడ్డి దొంతిరెడ్డి కార్యవర్గ ఉపాధ్యక్షునిగా టిటిఎ బోర్డు అఫ్ డైరెక్టర్లు ఓట్లు వేసి ఎన్నుకున్నారు. డా’ నరసింహ రెడ్డి అమెరికాలో కాన్సర్ చికిత్సకు కావాల్సిన మందుల తయారీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. టిటిఎ అధ్యక్షునిగా వంశీ రెడ్డి, ఉపాధ్యక్షులుగా నవీన్ మల్లిపెద్ది, కార్యవర్గ ఉపాధ్యక్షులుగా నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, కార్యదర్శిగా కవిత రెడ్డి, కోశాధికారిగా సహోదర పెద్దిరెడ్డి, కార్యనిర్వాహక డైరెక్టర్ గా దివాకర్ జంధ్యం, సహా కార్యదర్శిగా శివ రెడ్డి, సహా కోశాధికారిగా మనోహర్ బోడకె తదితరులు నియమితులయ్యారు.