తిరుపతి చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

R9TELUGUNEWS.COM: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన మనవరాలి పెళ్లి కోసం తిరుపతి చేరుకున్నారు. తిరుచానూరు యోగిమల్లవరంలోని ప్రైవేట్ కళ్యాణమండపంలో కార్యక్రమం జరుగుతోంది. వెంకయ్య నాయుడు కుటుంబం… పెళ్లికి ముందు జరిగే నలుగు వంటివి ఈ కళ్యాణ మండపంలో నిర్వహించి, తిరుమలలో ఈ రోజు రాత్రి నుంచి పెళ్లిలోని మిగిలిన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ రోజు సాయంత్రం తిరుచానూరు కళ్యాణ మండపం నుంచి తిరుమలలోని కళ్యాణ మండపానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వారి కుటుంబ సభ్యులు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ క్రమంలో తిరుచానూరు కళ్యాణ మండపం వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.