తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ రద్దు..

పౌర్ణమి సంద‌ర్భంగా నేడు శ్రీవారి గరుడ సేవను రద్దు చేస్తు‌న్నట్టు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ప్రస్తుతం స్వామివారి వార్షిక జ్యేష్ఠా‌భి‌షేకం ముగింపు వేడు‌కలు నిర్వహి‌స్తున్న నేప‌థ్యంలో గరుడ సేవను రద్దు చేస్తు‌న్నట్టు తెలి‌పింది.