చరిత్రలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం..!!!

టీటీడీ చరిత్రలో రికార్డ్ స్థాయిలో శ్రీవారికి హుండీ ఆదాయం..
జూలై నెలలో 139.45 కోట్లు వచ్చిన శ్రీవారి హుండీ ఆదాయం…
వరసగా 5వ నెల 100 కోట్లు దాటిన శ్రీవారి హుండీ ఆదాయం…
తిరుపతి వెంకటేశ్వర స్వామికి కానుకల రూపంలో వచ్చిన ఆదాయం రికార్డుస్థాయిలో నమోదైంది. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా జూలై నెలలో 139.45 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. దీంతో వరుసగా ఐదో నెల కూడా రూ . 100 కోట్లు దాటడం విశేషం. మార్చి నెలలో రూ. 128 కోట్లు, ఏప్రిల్ లో రూ. 127.5 కోట్లు, మే నెలలో రూ. 130.5 కోట్లు, జూన్ లో రూ. 123.76 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా జూలై నెలలో వచ్చింది..