తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది..

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. క్యూలైన్‌లో భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలను టీటీడీ అందిస్తోంది. దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 34,361 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.53 కోట్లు వేశారు…