పాక్షిక సూర్యగ్రహాణం సందర్భంగా,తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత..

పాక్షిక సూర్యగ్రహాణం సందర్భంగా పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేసింది. మూలవిరాట్టు కొలువై ఉన్న గర్భాలయ బంగారువాకిలి మెదలుకొని మహాద్వారం వరకు అధికారులు, అర్చకుల సమక్షంలో సన్నిధి గొల్ల తాళాలు వేసారు. గ్రహాణ సందర్భంగా దాదాపు పదిగంటల పాటు ఆలయం మూతలో ఉంటుందని, గ్రహణం పూర్తిగా విడిచిన అనంతరం రాత్రి 7:30 గంటల పై‌న ఆలయాన్ని తెరచి శుద్ధి , పుణ్యాహవచనం చేసినాంతరం సామన్యభక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గ్రహణం కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని కూడా టీటీడీ మూసివేసింది…