శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసినా టీటీడి…

శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీ).. నవంబర్‌ నెల కోటాకు చెందిన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది.. భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఇక, వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన ఈ టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు అధికారులు.. పరిపాలన కారణాలతో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను రిలీజ్‌ చేస్తూ వస్తుంది టీటీడీ.. డిసెంబర్‌ నెలకు సంబంధించిన వసతి గదులు కూడా ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాబులో ఉంచబోతోంది టీటీడీ…శ్రీవారి టికెట్లను ఆన్‌లైన్‌ విడుదల చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే హాట్‌ కేకుల్లా అయిపోతోన్న విషయం తెలిసిందే. ఇక, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. నిన్న స్వామివారిని 25,549 మంది భక్తులు దర్శించుకోగా.. 9764 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానిక 4 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. కాగా, సూర్యగ్రహణం కారణంగా.. నిన్న శ్రీవారి ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే.. ఉదయం ఎనిమిది గంటల 11 నిమిషాలకు మూతబడిన శ్రీవారి ఆలయం రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు మూసేఉంది.. అంటే మొత్తం 12 గంటల పాటు ఆలయాన్ని అధికారులు మూసి వేశారు.. దీంతో, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువగా ఉంది..

తిరుమలలో వృద్ధులు, దివ్యాంగుల టికెట్ల కోటా విడుదల..
ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.https://tirupatibalaji.ap.gov.in/#/login వెబ్ సైట్ లో లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.