తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…

తిరుమల(tirumala) లో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

కలియుగ వైకుంఠం(vaikuntha) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి(srivaari) సర్వదర్శనం కోసం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 79,974 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. 37,052 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వేంకటేశ్వరుని హుండీకి నిన్న రూ.3.77 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.