తిరుమలలో మరింత పెరిగిన భక్తుల రద్దీ…

*తిరుమలలో మరింత పెరిగిన భక్తుల రద్దీ.

తిరుమల :జూన్ 16
తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. నేడు (శుక్రవారం) క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. గురువారం 70,896 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 37,546 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

*శ్రీవారిని దర్శించుకున్న శర్వా దంపతులు.*.

శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని హీరో శర్వానంద్ దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఏపీ హైకోర్టు సీజే ఏ.వి శేష సాయి, ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్ తిలహరి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు…