తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..గంటలో శ్రీవారి దర్శనం!!

శ్రీవారి భక్తులకు శుభవార్త, గంటలో శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు గంటలో స్వామివారి సర్వదర్శనం అవుతోందని TTD అధికారులు వెల్లడించారు. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారని, వెంటవెంటనే దర్శనానికి పంపిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా భక్తుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. ఇక శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఆగస్టు 1న పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు.