తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది..

తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న మంగళవారం శ్రీవారిని 72,695 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు…

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 27,060 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు…..