తిరుమల నడక దారిన వెళ్లే భక్తులకు కర్రలు పంపిణీ… టీటీడీ చైర్మన్..
తిరుమల నడక మార్గంలో మరో చిరుత ఉన్నట్లు తెలుస్తోంది.
https://youtu.be/980OCvtVjrU?si=8vhvYISipnj27iMX
మరో చిరుత బుధవారం సంచరిస్తున్నట్లు కెమెరాల్లో సిబ్బంది గుర్తించారు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో తిరుమల కాలినడక దారి భక్తులను టీటీడీ అలెర్ట్ చేసింది. గత కొన్ని నెలల్లో ఐదు చిరుతల్ని టీటీడీ అధికారులు బంధించారు. చిరుతల సంచారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వాటిని కట్టడి చేయడంపై టీటీడీ దృష్టి సారించింది. చిరుతల సంచరాన్ని నిరోధించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమల కాలినడక మార్గంలో చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
శ్రీశైలం ఫారెస్ట్ నుంచి 8 వేల 500 కర్రలు తీసుకొచ్చామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి...
ఈ రోజు నుండి చేతికర్రలు పంపిణి చేస్తున్నాం. కర్రలు ఇచ్చినంత మాత్రన మేము చేతులు దుపుపుకుంటునట్లు కాదు. యాత్రికులకు తోడుగా రక్షకులు కూడా నడుస్తారు. రొటేషన్ పద్దతిలో కర్రలను వాడుతాం. పని కట్టుకొని విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు..