షాపులు సీజ్ చేస్తామని టీటీడీ హెచ్చరిక..!!

తిరుమలలో ప్లాస్టిక్పై నిషేధం విధించిన టిటిడి కొండపైన షాపులు, హోటళ్ల యజమానులకు పలు సూచనలు చేసింది. ‘వీలైనంత త్వరగా ప్లాస్టిక్ వస్తువులను తొలగించాలి. ఇకపై హెచ్చరికలు ఉండవు. షాపునే సీజ్ చేస్తాం. ప్లాస్టిక్ కవర్లతో కూడిన వస్తువులు, షాంపూలు, బొమ్మలు, దుస్తులు అమ్మవద్దు’ అని టిటిడి తెలిపింది. కాగా ఆరోగ్య శాఖ, నిఘా, భద్రతా విభాగం అధికారులతో 10 బృందాలుగా ఏర్పడి టీటీడీ తిరుమలలోని షాపుల్లో తనిఖీలు చేస్తోంది…!!