తిరుమల వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త…

తెలంగాణ నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టికెట్లు జారీ చేసేందుకు తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అంగీకరించారన్నారు. ఈ దర్శన టికెట్లు పొందలనుకున్న వారు ప్రయాణానికి రెండు రాజుల ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సులో టికెట్టు రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.