తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన నాలుగో చిరుత…

*ఆపరేషన్ చిరుత. బోనులో చిక్కిన నాలుగో చిరుత…
https://youtu.be/Q4k8KyeHQDk?si=qgOQAGCfrQB2wPLp

తిరుమల నడకదారిలో టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ ముగిసింది. ఎట్టకేలకు బోనులో నాలుగో చిరుత చిక్కింది. తిరుమల కాలినడక మార్గంలో వారం రోజులుగా చిరుతను ట్రాప్ చేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాలినడక మార్గంలో పలు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు….గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది. నిన్న రాత్రి 7వ మైలురాయి వద్ద బోనులో పడింది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగాప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది. ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి…ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది. ఈనెల 11న లక్షితపై చిరుతదాడి చేసి హతమార్చగా.. అలర్ట్ అయిన టీటీడీ, అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. ఈ క్రమంలో ఈనెల ఈనెల 14న,17వ తేదీన రెండు చిరుతలు బోనులో చిక్కాయి. తాజాగా నాలుగో చిరుత బోనులో చిక్కింది…