తస్మాత్ జాగ్రత్త.. ‘మోచా’ సైక్లోన్ ముప్పు పొంచి ఉంది.!.

ఇప్పటికే అకాల వర్షాలతో జనం అతలాకుతలం అవుతున్నారు. మళ్లీ పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు. మే 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఫలితంగా వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని అమెరికా వాతావరణ అంచనా వ్యవస్థ గ్లోబల్ వెదర్ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్ (జీఎఫ్ఎస్), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్‌లు (ఈసీఎండబ్ల్యూఎఫ్) అంచనా వేసిన తర్వాతనే ఐఎండీ ఈ ప్రకటన చేసింది. ఈ తుఫానుకు ఐఎండీ ‘మోచా’ అని పేరు పెట్టింది. మోచా అనేది యెమెన్ తన ఎర్ర సముద్రం తీరంలోని ఓడరేవు నగరం పేరు ఈ తుఫానుకు పెట్టారు.