బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం..మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం…!.

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ, ఒడిశాకు దక్షిణ-ఆగ్నేయదిశగా 190 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిగాకు నైరుతి దిశగా 280 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 390 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ శుక్రవారం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.