అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను..

అరేబియా(arebiya) సముద్రంలో బిపర్ జోయ్ తుపాను(tufan) ఏర్పడింది. గోవాకు నైరుతి దిశగా 950 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ముంబైకి(mumbai) 1,050 కి.మీ దూరంలో కొనసాగుతోంది. గంటకు 4 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తుపాను మరింత బలపడి తీవ్రంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.