?ఒక రైతు తన పొలంలో పశువుల కి గడ్డి కోస్తూ వుండగా ఒక పాము ఆ గడ్డి మోపుల్లోకి దూరింది.
?రైతు గడ్డి మొక్కలతో పాటు పచ్చని తులసి మొక్కలు కూడా పెరగడం గమనించాడు.
?ఆ తులసి దళాల సువాసన అతనికి ఏదో కొత్త ఉత్సాహాన్ని , చైతన్యాన్ని కలిగించింది.
?ఆ రైతు తులసి చెట్లని కూడా గడ్డి తో పాటు మోపు కట్టి తల మీద పెట్టుకుని ఇంటికి బయల్దేరాడు.
? తన తల మీద వున్న గడ్డి మోపులో పాముదాగి వుందన్న విషయం రైతుకు తెలియదు.
?ఆ గడ్డి మోపులోవున్న తులసి చెట్ల శక్తి వలన ఆ పాము బయటకు పోలేక
పోయింది.
?అదే మార్గంలో ఒక ఆశ్రమంలో నివసిస్తున్న ఒక త్రికాల జ్ఞాని ఒకరు
గడ్డి మోపు తీసుకుని వెడుతున్న రైతు వెనకాల యమ దూతలు కూడా వెడతూ వుండడం గమనించాడు.
? ఆ జ్ఞాని యమదూతలని
కారణమడిగాడు.
?’స్వామీ ! ఆ రైతు ఆయుర్దాయం తీరిపోయినందున
పాము కాటుకి బలి చేసి
అతని జీవుణ్ణి తీసుకుని
వెడదామని వచ్చాము.
?కాని రైతు తలమీద వున్న తులసి శక్తి అతనిని కాపాడుతున్నది. అతను ఆ తులసి మొక్కలకు దూరం కాగానే అందులోని పాముకూడా బయటకు వచ్చి
?అతని ప్రాణాలు తీస్తుంది మేము
అతని జీవాల్ని తీసుకుపోతాము ” అని
యమదూతలు చెప్పారు.
?రైతుని యెలాగైనా కాపాడాలని ఆ జ్ఞాని ఆలోచించాడు .యమదూతలని ‘ ఆ రైతుకు ఆయుర్దాయం పెంచే మార్గమే లేదా? అని అడిగాడు జ్ఞాని.
?అందుకు యమదూతలు ‘మహర్షీ! ఎవరైనా పుణ్యాత్ములు తమ పుణ్యఫలాలని ధారపోస్తే ఆ రైతు ప్రాణాలు దక్కుతాయి ” అని అన్నారు
?ఆ మహర్షి ఆనందంతో
తన వద్ద వున్న పుణ్యఫలమంతా ఆ
రైతుకి ధార పోశాడు
రైతు మరణంనుండి బైటపడి పోయాడు.
?తులసీ పురాణములో ఈ వృత్తాంతం చెప్పబడింది.