తుమ్మలతో పొంగులేటి భేటీ…

కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానన్న తుమ్మల..

కాంగ్రెస్ పార్టీలో చేరికపై తుమ్మల క్లారిటీ ఇవ్వలేదు. హస్తం పార్టీలోకి తనను ఆహ్వానించినందుకు పొంగులేటితో భేటీ అనంతరం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ నుంచి గోదావరి జలాల విడుదలను చూడాలన్నదే తన కోరిక అని చెప్పారు. ఆ ప్రాజెక్టు కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్య కర్తలు, సన్నిహితుల సలహాతో త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు…

అభిమానులతో చర్చించి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని తుమ్మల ఇదివరకే తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తనను ఆహ్వానించిందని.. అయితే అభిమానుల అభిప్రాయానికనుగుణంగా నడుచుకుంటానన్నారు. ఈ క్రమంలో తుమ్మల నివాసానికి కాంగ్రెస్‌ నేత పొంగులేటి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై ఆయనతో చర్చించారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు..

కాంగ్రెస్ పార్టీ తరుపున తుమ్మలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఏ పార్టీలో ఉన్న నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి తుమ్మల అని కొనియాడారు. కొన్ని శక్తులు పోమనలేక పొగపెట్టి తమను బయటకు పంపిస్తున్నారు. మీ మీద్దరం కూడా అదే కోవలోకి వస్తామన్నారు. బీఆర్ఎస్ కు బలం లేని ఖమ్మం జిల్లాలో తుమ్మల లాంటి వ్యక్తులు పార్టీ బలోపేతానికి కృషి చేసారని వెల్లడించారు. సీఎం అపాయిట్ మెంట్ కూడా దొరకని పరిస్థితి అని ఫైర్‌ అయ్యారు పొంగులేటి.