తుంగభద్రకు ఎగువ నుంచి భారీగా వరద…!.21 గేట్లు ఎత్తివేత..!

కర్నూలు

*TB. తుంగభద్ర డ్యాం కు పెరుగుతున్న నీటి ప్రవాహం..

21 గేట్లు ఎత్తివేత..

దిగువకు 70,000 వేల క్యూసెక్కుల నీరు విడుదల

గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ..

మరో మూడు గేట్లు ఎత్తే అవకాశం..

ఇన్ ఫ్లో 71,052 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో. 65,464 క్యూసెక్కులు

TB డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం. 1633.00 అడుగులు.

ప్రస్తుత నీటి మట్టం 1624.95 అడుగులు.

TB డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ. 105.788 టిఎంసిలు

ప్రస్తుత నీటి నిల్వ. 76.320 టిఎంసిలు..

ఎగువ నుంచి భారీగా వరద…!

రేపు సాయంత్రం, లేదా ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం..!..

భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు తుంగభద్ర డ్యామ్ 20 గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1625.4 అడుగులకు చేరుకుంది. ఇన్‌‌ఫ్లో 28932 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 62766 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్తాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 78.01 టీఎంసీల నీరు ఉన్నట్లు వివరించారు..