భారీ వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కకావికలం.27 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాలు…!!.

భారీ వర్షాలతో భారత్ లో ప్రస్తుతం కొంత ఎఫెక్ట్ పలు రాష్ట్రాల్లో చూపించడం జరిగింది… ముఖ్యంగా ప్రధాన నగరాలు మొత్తం కూడా జలమయిపోయాయి.. అదేవిధంగా వరదలు ప్రపంచంలో పలు దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది..

భారీ వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కకావికలమవుతోంది. గత 27 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. వందలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. సహాయక బృందాలు, సైన్యం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. సుమారు 4 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా రాతి ఎడారి ప్రాంతంగా పేరుపొందిన ఫుజైరా, షార్జాల్లో కురిసిన భారీ వర్షమే వరదలకు కారణమైనట్టు అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో ఏకంగా 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది…