ఉక్రెయిన్ సైన్యం ఉపసంహరణకు రష్యా నిర్ణయం…. ఈ ఒప్పందం ఓకే అంటేనే .ఉపసంహరణ..రష్యా అధ్యక్షుడు పుతిన్..
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా వెనక్కు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నది. ఉక్రెయిన్‌లోని కీవ్ తదితర నగరాల చుట్టూ నిలిపిన సైన్యాలను ఉపసంహరించుకోవడానికి రష్యా అంగీకరించినట్లు తెలుస్తున్నది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య మంగళవారం మూడో దఫా చర్చలు జరిగాయి. ఇరు దేశాల ప్రతినిధులు దాదాపు మూడు గంటల పాటు శాంతి చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది.నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నదంటూ రష్యా మండి పడింది. నాటోలో చేరనని రాత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన డిమాండ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పట్టించుకోవడం లేదు. దీంతో ఉక్రెయిన్ మీదకు సేనలను నడిపించారు పుతిన్. ఫలితంగా పలు కీలక నగరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాను కట్టడి చేయడానికి అమెరికా, దాని మిత్ర పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్యేకించి అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో అమలవుతున్న స్విఫ్ట్ సిస్టమ్ నుంచి రష్యాను బహిష్కరించాయి. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం కూడా రష్యా తీరును తప్పుబట్టినా పుతిన్ వెనక్కు తగ్గలేదు.