రష్యాకు చెందిన 10 వేల మందికి పైగా సైనికులను చంపేసినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ వెల్లడి…

రష్యా ముందు సైనికపరంగా, ఆయుధపరంగా తక్కువగా ఉన్నప్పటికీ ఉక్రెయిన్ సైనికులు గుండె ధైర్యంతో ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో రష్యా ఊహించని విధంగా నష్టోపోతోంది. అవును ఇప్పటికే రష్యాకు చెందిన 10 వేల మందికి పైగా సైనికులను చంపేసినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ వెల్లడించింది. అంతేకాకుండా 269 ట్యాంకులు, 945 సాయుధ పోరాట వాహనాలు, 105 ఆర్టిలరీ వ్యవస్థలు, 50 మల్టీపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌లను ధ్వంసం చేసింది. 39 యుద్ధ విమానాలు, 40 హెలికాప్టర్లు, 409 మోటారు వాహనాలు, రెండు తేలికపాటి స్పీడ్ బోట్లు, మూడు యూఏవీ లను రష్యా నష్టోపోయింది..రష్యా తో పోరాటం చేసేందుకు విదేశాల్లో ఉన్న ఉక్రెయిన్ ప్రజలు సొంత దేశానికి చేరుకోవటం విశేషం. అలా దాదాపు 66,224 మంది వచ్చారని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సి రెజ్నికోవ్​ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.
‘ఈ సమయంలో తమ మాతృ దేశాన్ని దుండగుల నుండి రక్షించుకోడానికి చాలా మంది పురుషులు విదేశాల నుండి తిరిగి వచ్చారు. ఇవి మరో 12 పోరాట, ప్రేరేపిత బ్రిగేడ్‌లు! ఉక్రెయిన్‌ ప్రజలారా.. మనం అజేయంగానే ఉన్నాము’ అని ట్వీట్ చేశారు..