ఉక్రెయిన్-రష్యా సంక్షోభ ప్రభావం వంటనూనె ధరలపై..!!!

రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం భారత్కు కొంత ఇబ్బందులు తెచ్చి పెట్టే లా అనిపిస్తుంది… ఈ యుద్ధంతో కొన్ని నీటి పై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అంటున్నారు నిపుణులు అందులో భాగంగా పేద మధ్యతరగతి వారి పైన ఎక్కువ ప్రభావం చూపవచ్చని అంచనా…
ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సైనిక చర్య ప్రారంభించడంతో ఇప్పుడు ఆ ప్రభావం అన్నింటి మీద పడుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు బంగారం ధరలు పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్, క్రీప్టో మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. అయితే, వాటితో పాటు ఇప్పడు ఉక్రెయిన్-రష్యా సంక్షోభ ప్రభావం వంటనూనె ధరల మీద కూడా పడనుంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు నూనె సరఫరాలో అంతరాయం కారణంగా ధరలు భారీగా పెరగనున్నట్లు తయారీదారులు పేర్కొన్నారు. 80 శాతం సన్-ఫ్లవర్ ఆయిల్‌ను మన దేశం మాజీ సోవియట్ రిపబ్లిక్ నుంచి దిగుమతి చేసుకుంటుంది…భారతదేశం మొత్తం 18.93 లక్షల టన్నుల ముడి సన్-ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇందులో 13.97 లక్షల టన్నులు ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకోవడం గమనర్హం. ఇంకా, అర్జెంటీనా (2.24 లక్షల టన్నులు), రష్యా (2.22 లక్షల టన్నులు) నుంచి దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు పేర్కొంటునాయి. గణాంకాల ప్రకారం, ఉక్రెయిన్ సన్-ఫ్లవర్ ఆయిల్‌ను భారతదేశానికి ఎగుమతి చేసే ఏకైక ప్రధాన సరఫరాదారు. వంటనూనె తయారీదారుల అత్యున్నత సంస్థ సాల్వెంట్ అండ్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్(సీ) అధ్యక్షుడు అతుల్ చతుర్వేది మాట్లాడుతూ.. వంటనూనె ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. “ఉక్రెయిన్, రష్యా నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా మనదేశానికి వస్తుంది. ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల దాని సరఫరాలో అంతరాయం కలిగితే ధరలు ఊహించని స్థాయిలో పేరుగుతాయని భావిస్తున్నారు. మేము నెలకు దాదాపు 2.0 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాము” అని చతుర్వేది అన్నారు…