భార‌తీయ విద్యార్థుల‌ను ఉక్రెయిన్ బంధించిన‌ట్లు ర‌ష్యా చేసిన ఆరోప‌ణ‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం ఖండించింది..

ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై వివరణ ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. విద్యార్థులు బందీలుగా ఉండటంపై మాకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఉక్రెయిన్‌లోని ఇండియా ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భార‌తీయ విద్యార్థుల‌ను ఉక్రెయిన్ బంధించిన‌ట్లు ర‌ష్యా చేసిన ఆరోప‌ణ‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం ఖండించింది. ఇండియ‌న్ స్టూడెంట్స్‌ను ఓ హ్యూమ‌న్ షీల్డ్ త‌ర‌హాలో ఉక్రెయిన్ సైనిక బ‌ల‌గాలు వాడుతున్న‌ట్లు ర‌ష్యా ఆరోపించింది. త‌మ భూభాగంలోకి విద్యార్థులు వెళ్ల‌కుండా ఉక్రెయిన్ అడ్డుకుంటున్న‌ట్లు కూడా ర‌ష్యా పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇవాళ విదేశాంగ‌శాఖ‌ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. ఉక్రెయిన్‌లో భార‌తీయ విద్యార్థుల‌ను బంధించిన‌ట్లు త‌మ‌కు ఎటువంటి రిపోర్ట్ రాలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు…. ఇప్పటి వరకు 17,000 మంది భారతీయులు అక్కడి నుంచి ఖాళీ చేయబడ్డారు. ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో ఆపరేషన్ గంగ వేగంగా కొనసాగుతోంది….ర‌ష్యా, రొమేనియా, పోలాండ్‌, హంగేరి, స్లోవేకియా, మాల్డోవా దేశాల‌తోనూ స‌మ‌ర్ధ‌వంతంగా స‌హ‌కారం తీసుకుంటున్నామ‌ని, ఉక్రెయిన్ నుంచి గ‌త కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్య‌లో భార‌తీయుల‌ను త‌ర‌లించామ‌ని అరింద‌మ్ తెలిపారు.ఉక్రెయిన్ అధికారులు అందించిన స‌హ‌కారాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.