ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్నది. సోమవారం పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్ నగరంలో పలు మిస్సైళ్లతో జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరో వైపు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వ్యూహాత్మకంగా ముఖ్యమైన మారియుపోల్ నగరంలో చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఓడరేవుల నగరంగా ప్రసిద్ధి చెందిన నగరంలో భారీ స్టీల్ ప్లాంట్లను రష్యన్ సైన్యం ధ్వంసం చేసింది…సోమవారం జరిపిన రష్యా జరిపిన మిస్సైల్ దాడుల్లో ఏడుగురు మరణించారని, ఒక చిన్నారి సహా ఎనిమిది గాయపడ్డారని ఎల్వివ్ గవర్నర్ మక్సిమ్ కోజిటిస్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ తూర్పు పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లోని ఆయుధ కర్మాగారాలు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తున్నది. మరో వైపు రష్యాకు లొంగిపోయేది లేదని ఇప్పటికే జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఉక్రేనియన్ నగరాలపై దాడిని కొనసాగించేందుకు రష్యా దళాలకు సహాయం చేయడానికి సిరియన్ సైన్యం యుద్ధంలో పాల్గొనాలని యోచిస్తున్నారు…అంతకు ముందు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2017 సిరియా పర్యటన సందర్భంగా అక్కడి జనరల్‌ను ప్రశంసించారు. ఈ క్రమంలో బ్రిగేడియర్ జనరల్ సుహైల్ అల్ హసన్ ఆధ్వర్యంలో సిరియా దళాలు రష్యా తరఫున ఉక్రెయిన్‌లో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు మరియూపోల్‌లో పరిస్థితి దారుణంగా ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రి కులేబా పేర్కొన్నారు. నగరంలో ఉక్రేనియన్ ఆర్మీ సిబ్బంది, పౌరులను రష్యన్ దళాలు చుట్టుముట్టాయన్నారు. ఉక్రెయిన్ పోరాటం కొనసాగుతుందని, కానీ భారీ విధ్వంసం కారణంగా ఇప్పుడు నగరం ఉనికిలో లేదని పేర్కొన్నారు…మరో వైపు రష్యా దూకుడుతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) అదనంగా 50 మిలియన్ యూరోల మానవతా నిధులను ఉక్రెయిన్‌కు కేటాయిస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. ఇందులో ఉక్రెయిన్‌లోని మానవతా ప్రాజెక్టుల కోసం 45 మిలియన్లు, మోల్డోవా కోసం 5 మిలియన్ల యూరోల సాయం అందిస్తున్నట్లు తెలిపింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.