కీవ్ గ‌గ‌న‌త‌లంలోకి వ‌చ్చిన ర‌ష్యా విమానాన్ని కూల్చివేసిన ఉక్రెయిన్,, సోషల్ మీడియాలో వీడియో వైరల్.

https://twitter.com/BNONews/status/1497042382612836361?t=86P5N00ly69Ppkmes5LY9A&s=08
గురువారం రాత్రి కీవ్ గ‌గ‌న‌త‌లంలోకి వ‌చ్చిన ర‌ష్యా విమానాన్ని కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్ల‌డించింది. రాత్రి పూట కీవ్ న‌గ‌రంపై పేల్చివేత‌కు గురైన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. సెంట్ర‌ల్ కీవ్ ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు జ‌రిగాయి. మ‌రో పేలుడు దూర ప్రాంతంలో చోటుచేసుకున్న‌ట్లు అధికార వ‌ర్గాలు ద్వారా తెలుస్తోంది. గురువారం రాత్రి కీవ్ లో జ‌రిగిన దాడికి సంబంధించి తొలుత స‌మాచారం రాలేదు. ఏదో గుర్తు తెలియ‌ని వ‌స్తువును పేల్చిన‌ట్లు తెలిపారు. కానీ ఆ త‌ర్వాత ర‌ష్యా యుద్ధ విమానాన్ని పేల్చిన‌ట్లు ఉక్రెయిన్ హోంశాఖ తెలిపింది…