రష్యా , ఉక్రెయిన్ మధ్య తీర్మానాలు లేకుండానే చ‌ర్చ‌లు విఫలం…

ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య సోమ‌వారం మధ్యాహ్నం మొద‌లైన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. బెలార‌స్ వేదిక‌గా జ‌రిగిన ఈ చ‌ర్చ‌ల్లో ఇరు దేశాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కే క‌ట్టుబ‌డి సాగాయి. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం చేసిన డిమాండ్ల‌ను ఇరు దేశాలు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేదు… శాంతి చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. రెండు దేశాల మ‌ధ్య ష‌ర‌తులు, డిమాండ్ల‌తో ప్ర‌తిష్ఠంభ‌న నెల‌కొన్న‌ట్లు తెలుస్తున్న‌ది. రెండు దేశాల ప్ర‌తినిధులు నాలుగు గంట‌ల సేపు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇరు వ‌ర్గాలు త‌మ వైఖ‌రికే క‌ట్టుబ‌డిన‌ట్లు క‌నిపిస్తున్న‌ది…ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం చేసిన డిమాండ్ల‌ను ఇరు దేశాలు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేదు. ఈ కార‌ణంగా గంట‌ల త‌ర‌బ‌డి సాగిన ఈ చ‌ర్చ‌లు సింగిల్ తీర్మానం కూడా లేకుండానే ముగిశాయి..అమెరికా సార‌ధ్యంలోని నాటో కూట‌మిలో చేర‌బోమ‌ని ఉక్రెయిన్ లిఖిత పూర్వ‌కంగా రాసివ్వాల‌ని ర‌ష్యా డిమాండ్ చేసింది. అలా లిఖిత పూర్వ‌కంగా హామీ ఇస్తే, సైన్యాన్ని ఉప సంహ‌రిస్తామ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. కానీ నాటో కూట‌మిలో చేరే విష‌య‌మై ఉక్రెయిన్ వెన‌క్కు త‌గ్గిన‌ట్లు క‌నిపించ‌డం లేదు…అంతే కాదు సైనిక బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. క్రిమియా నుంచి కూడా సైనిక బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. నాటో కూట‌మిలో చేరేందుకు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ సిద్ధ ప‌డ‌టం వ‌ల్లే ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఆగ్ర‌హించారు. ఉక్రెయిన్‌పై సైనిక చ‌ర్యకు దిగారు..లొంగిపోయే ప్ర‌స‌క్తే లేద‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. చ‌ర్చ‌ల్లో ఐదుగురు ర‌ష్యా, ఆరుగురు ఉక్రెయిన్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు. …ఈ క్ర‌మంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత బెలార‌స్‌లో మొద‌లైన చ‌ర్చ‌ల‌కు ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, ర‌ష్యా నుంచి ఐదుగురు ప్ర‌తినిధుల‌తో కూడిన బృందాలు చ‌ర్చ‌ల‌కు కూర్చున్నాయి. దాదాపుగా 3 గంట‌ల‌కు పైగానే చ‌ర్చ‌లు జరిపినా… ఏ ఒక్క తీర్మానం లేకుండానే రెండు దేశాలు చ‌ర్చ‌ల‌ను ముగించాయి.