ఉక్రెయిన్ పై శక్తిమంతమైన ఆయుధాలతో దాడి చేస్తున్న రష్యా…

ఉక్రెయిన్ పై శక్తిమంతమైన ఆయుధాలతో దాడి చేస్తున్న రష్యా… తాజాగా మేరియుపోల్ నగరాన్ని అధీనంలోకి తెచ్చుకున్నట్టు ప్రకటించింది. మేరియుపోల్ లో ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని డెడ్ లైన్ విధించిన రష్యా… తాజాగా, మేరియుపోల్ నుంచి ఉక్రెయిన్ బలగాలను తరిమికొట్టామని వెల్లడించింది. కాగా, రష్యా బలగాలు అజోవ్ స్థల్ స్టీల్ ప్లాంట్ పై దాడికి సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అజోవ్ స్థల్ ప్లాంట్ లో 400 మంది విదేశీ సైనికులు ఉన్నారని, వారంతా కెనడా, యూరప్ దేశాలకు చెందినవారని రష్యా తెలిపింది. లొంగిపోవాలని సూచించినా కొందరు లెక్క చేయడంలేదని, ప్రతిఘటనకు దిగిన వారిని నాశనం చేస్తామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి హెచ్చరించారు…