ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది..!!!!!త్రిశూల వ్యూహం తో ఉక్రెయిన్ పై విరుచూపడుతున్న రష్యా…..

రోజురోజుకీ ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం పెరుగుతూనే పోతుంది…. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న కానీ వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ను రష్యా ప్రకటించింది.
అన్ని ఏర్పాట్లు చేసుకుంది. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, మందుగుండు సామాగ్రి, వైమానిక శక్తి వంటి అన్ని భద్రతా వనరులను రష్యా మోహరించింది. ఉక్రెయిన్ చుట్టూ సుమారు 1.30,000 మంది రష్యన్ సైనికులు ఇప్పటికే మోహరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంపై దండయాత్రకు 70 శాతం బలగాలను పుతిన్ వాడుకుంటున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. మరికొన్ని గంటల్లో యుద్ధం జరగవచ్చని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ హెచ్చరించారు…

డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది.ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ దేశ చర్యల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో కూడా ఊహించని విధంగా చేసి చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఉక్రెయిన్‌లో పలు నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే రష్యా తాజా ప్రకటనతో ప్రపంచ దేశాలు షాక్‌కు గురవుతున్నాయి. అటు అమెరికా కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ బలగాలను దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఎలాగైనా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ను కాపాడాలని అమెరికా భావిస్తోంది. అయితే… రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుంతుని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు….

త్రిశూల వ్యూహం తో ఉక్రెయిన్ పై విరుచూపడుతున్న రష్యా…..

రెండు లక్షల సైన్యంతో ఉక్రెయిన్ లోని నగరాలను అక్రమించుకుంటున్న రష్యా…
పేలుళ్లతో దద్దరిల్లిపోతున్న ఉక్రెయిన్ రాజధాని ,ఇతర నగరాలు….

ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం రావలన్నదే మా ఆకాంక్ష పుతిన్…
నాటో పెత్తనం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు.. పుతిన్..